బాలీవుడ్ సెలెబ్రిటీ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ’83’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983లో మొట్ట మొదటి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న కథ ఆధారంగా తెరకెక్కించారు. ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించినప్పుడు కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతదేశం సాధించిన విజయాన్ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అయితే తాజాగా దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ‘బాయ్‌కాట్ 83’ అనే హ్యాష్‌ట్యాగ్ శుక్రవారం ఉదయం నుండి ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. గత సంవత్సరం విడుదలైన చిప్స్ యాడ్ లో సుశాంత్‌ను ఎగతాళి చేసినందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు రణ్‌వీర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఒకటి కాదు అనేక కారణాల వల్ల సినిమాను బహిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫ్లాప్ అంటూ రణ్‌వీర్ సింగ్.. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్‌లకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాడు. JNU విద్యార్థులకు దీపికా పదుకొణె మద్దతుగా నిలిచినపప్టి నుంచి ఆమె పట్ల ప్రజల అసంతృప్తి కన్పిస్తోంది. ఇక రణవీర్ సింగ్ గత ఏడాది సుశాంత్ ను ఎగతాళి చేశాడు కాబట్టి ఆయన సినిమాలను బహిష్కరించాలని సుశాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు రణవీర్ సింగ్, ఇతర నకిలీ బాలీవుడ్ తారలు పాకిస్తాన్‌కు చెందిన ఈ ISI ఏజెంట్లతో ఎలా పార్టీలు చేసుకుంటున్నారో చూడండి అంటూ పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. డ్రగ్గివుడ్ అంటూ బాలీవుడ్ పై విరుచుకుపడుతున్నారు. సుశాంత్ అభిమానులు ఈ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి ఏడాది గడిచిపోయినా అభిమానుల ఆగ్రహం మాత్రం ఇంకా చల్లారలేదు.
