NTV Telugu Site icon

Bhola Shankar: చిరంజీవి చిత్రంలో సుశాంత్!

Chiru

Chiru

Bhola Shankar:యంగ్ హీరో సుశాంత్ తన స్ట్రేటజీని మార్చేశాడు. ‘కాళిదాస్’ మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు కొన్నేళ్ళ పాటు సోలో హీరోగా సినిమాలు చేశాడు. అందులో కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. దాంతో స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్ర లభిస్తే నటించాలనే నిర్ణయం తీసుకున్నాడు సుశాంత్. అలా అతను చేసిన తొలి చిత్రం ‘అల వైకుంఠపురములో’! ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మాస్ ఆడియెన్స్ లోకి సుశాంత్ సైతం చొచ్చుకుని పోయాడు. దాంతో అతని స్ట్రేటజీ కరెక్టే అని తేలింది. అందుకే మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’ చిత్రంలోనూ నటించడానికి పచ్చ జెండా ఊపాడు. ఏప్రిల్ 7న పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘రావణాసుర’లో సుశాంత్ కీ-రోల్ ప్లే చేశాడు. సుశాంత్ మేకోవర్ లుక్ చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇందులో రవితేజ, సుశాంత్ పై చిత్రీకరించిన యాక్షన్ పార్ట్ మాస్ ను ఆకట్టుకుందని తెలుస్తోంది.

Neha Malik: కుర్రాళ్లకు కిక్ ఇవ్వడంలో అమ్మడు బ్రాండ్ అంబాసిడర్

ఇదిలా ఉంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’లోనూ సుశాంత్ కు చోటు దక్కిందన్నది ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రను జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ పోషిస్తోంది. ఆమె ప్రియుడిగా సుశాంత్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడట. తమిళ వర్షన్ లో ఈ పాత్ర నిడివి తక్కువే అయినా, ఇక్కడ సుశాంత్ ను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ ను కాస్తంత పెంచారని, ఓ పాటలో సైతం సుశాంత్ కనిపిస్తాడని అంటున్నారు. అయితే సుశాంత్ ‘భోళాశంకర్’లో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బహుశా మార్చి 18న సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతని లుక్ ను విడుదల చేస్తూ, అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయొచ్చు. ఏదేమైనా సుశాంత్… ఇటు చిరంజీవి, అటు రవితేజ చిత్రాలలో నటిస్తూ… తన పరిథిని పెంచుకుంటున్నాడు. అలానే సోలో హీరోగా నటించేందుకూ కొన్ని కథలు వింటున్నాడు. గత యేడాది ‘మా నీళ్ళ ట్యాంక్’ వెబ్ సీరిస్ తో సుశాంత్ డిజిటిల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా అడుగుపెట్టాడు. సో… బలమైన పాత్ర లభిస్తే చాలు సై అనడానికి సుశాంత్ సిద్థంగా ఉన్నట్టు తెలుస్తోంది.