కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వేరియేషన్స్ చూపించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూర్య మాత్రమే. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్య, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కంగువ’. సౌత్ లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సిరుత్తే శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇది. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా కంగువ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే బయటకి వచ్చాయి. ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్న కంగువ టైటిల్, సినిమాపై అంచనాలని పెంచింది. తాజాగా కంగువ లేటెస్ట్ షెడ్యూల్ జూన్ 20న EVP ఫిల్మ్ సిటీలో జరగనుందనే అప్డేట్ బయటకి వచ్చింది.
ఎనిమిది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చెయ్యనున్నారు. ఈ నెలలో కంగువ ప్రోమో కూడా రిలీజ్ కానుంది. ఈ అప్డేట్ కారణంగా సూర్య ఫాన్స్ సోషల్ మీడియాలో కంగువ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు సూర్య లుక్ అంటూ కొన్ని ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఒరిజినల్ పోస్టర్స్ లా ఉన్న ఈ ఫొటోస్ ని ఫాన్స్ AI టెక్నాలజీతో రూపొందించారు. ఈ ఫొటోస్ చూస్తుంటే సూర్య హాలీవుడ్ అడ్వెంచర్ సినిమాల్లో ఉండే హీరోలా కనిపిస్తున్నాడు. ఈ రేంజ్ లుక్ ని డైరెక్టర్ శివ అచీవ్ చేస్తే చాలు కంగువ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎర్త్ షాటరింగ్ రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది.
