NTV Telugu Site icon

Surya: మరోసారి ద్విపాత్రాభినయంలో అలరించనున్న సూర్య

Surya

Surya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ‘కంగువ’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూర్య అనంత‌రం వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల‌లో ‘రెట్రో’,‘ఆర్జే బాలాజీ’ వంటి చిత్రాలతో పాటు భారీ బడ్జెట్‌తో సూర్య – వెట్రిమారన్ కలయికలో  ‘వాడివాసల్’ అనే చిత్రం కూడా తెరకెక్కనుంది. 

తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రూపొందనుంది. దీనికోసం సూర్య జల్లికట్టు క్రీడలో కఠిన శిక్షణ తీసుకోనున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకొచ్చింది. ఎంటంటే సూర్య ఇందులో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సూర్య ద్విపాత్రాభినయం అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చే మూవీ ‘సూర్య S/O కృష్ణన్’ . ఇందులో సూర్య నటనకు తిరుగులేదు అని చెప్పాలి. ఈ సినిమాతో తెలుగులో కూడా  మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు సూర్య. ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అంటే ఇదే .  దీంతో పాటు సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన మరో మూడు నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఒక్కొ మూవీ ఒక్కో హిట్ అని చెప్పవచ్చు . ఇక ఇప్పుడు ‘వాడివాసల్’ మూవీ లో మరోసారి  డబల్ రోల్ లో కనపడనున్నాడు.  మరి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

 

Show comments