తమిళ స్టార్ హీరో సూర్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోలివెడ్ తో పాటు తన విలక్షణ నటనతో తెలుగులో కూడా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరగా ‘కంగువ’ మూవీతో వచ్చిన సూర్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘రెట్రో’ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జోజు జార్జ్, జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, కరుణాకరన్, విద్యా శంకర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటి శ్రియా శరణ్ ప్రత్యేక పాటలో కనిపించనుంది. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, 2D ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న తమిళం, తెలుగులో ఒకేసారి థియేట్రికల్ విడుదల కోసం షెడ్యూల్ చేయబడింది. కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లియో (తమిళం), దేవర (తెలుగు), బ్రహ్మయుగం (మలయాళం) వంటి చిత్రాలను పరిశ్రమల అంతటా విజయవంతంగా పంపిణీ చేయగా, ఇప్పుడు టాలీవుడ్‌లో ‘రెట్రో’ రిలీజ్ చేస్తున్నారు.
Also Read: Salmaan Khan : ‘సికందర్’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా, ఈ మూవీ సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ నుండి విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా. తాజాగా ఈ మూవీ నుండి ‘కనిమా..’ అనే మరో పాటను విడుదల చేసింది. సంతోశ్ నారాయణన్ స్వరపరిచిన ఈ గీతంలో అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సూర్య పూజల జంట. ‘నన్ను నీ ప్రేమలో పడేయ్.. అంటూ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది పాట.