Site icon NTV Telugu

Rajamundry: హీరో రామ్‌చరణ్‌కు తియ్యటి కానుక.. బాహుబలి ఖాజా

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఆర్‌.ఆర్.ఆర్ తర్వాత డైరెక్టర్ శంకర్‌తో రామ్‌చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చిత్రీకరణ కోసం రాజమండ్రి వెళ్లిన రామ్ చరణ్ అభిమానులతో ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. రామ్‌చరణ్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా అతడికి సురుచి సంస్థ మధురమైన కానుక అందించింది. తాపేశ్వరంలో తయారుచేసిన ఈ బాహుబలి కాజాను చెర్రీకి బహూకరించింది.

కాగా రాజమండ్రి వచ్చే ప్రముఖులకు సురుచి సంస్థ బాహుబలి కాజాను బహూకరించడం ఓ ఆనవాయతీగా వస్తోంది. గతంలో సమంత, నాగార్జున, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా తదితర సినీ తారలు కూడా ఈ స్పెషల్ కాజా రుచి చూశారు. తాజాగా ఈ బాహుబలి కాజాను దర్శకుడు శంకర్‌కు కూడా అందజేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరుపెట్టలేదు. రామ్ చరణ్ కెరీర్‌లో ఇది 15వ చిత్రం. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.

Exit mobile version