కోలీవుడ్ స్టార్ సూర్య కి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో చెప్పక్కర్లేదు. తెలుగులో కూడా సేమ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ ప్రజంట్ సరైన హిట్ కొట్టి మాత్రం చాలా కాలం అవుతుంది. దీంతో ప్రజంట్ వరుస ప్రజెక్ట్‌లతో బీజి అయ్యారు. తమిళ సినిమాల్లో పండుగ సీజన్ అంటే ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలు బరిలోకి వస్తే అభిమానుల హడావుడి, థియేటర్లలో సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఈ పోటీలు కొన్నిసార్లు కొందరికి కష్టాలు తెచ్చిపెడతాయి. తాజాగా హీరో సూర్య కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
Also Read : Upasana : సెకండ్ బేబీ ప్లాన్‌పై ఉపాసన ఓపెన్ టాక్..
ప్రజంట్ సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’. వరుస ఫ్లాపుల తర్వాత ఈ సినిమా తనకు మళ్లీ సక్సెస్ తెస్తుందనే నమ్మకంతో, దాన్ని సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించాడు. పండుగ హంగామా తన సినిమాకు కలిసొస్తుందని ఆశించాడు. కానీ ఈ ప్లాన్‌కు పెద్ద షాక్ తగిలింది. విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ ఇప్పటికే జనవరి 9న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దీనికి అదనంగా, శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘పరాశక్తి’ కూడా జనవరి 14న ప్రేక్షకులను పలకరించనుంది. అంటే రెండు పెద్ద సినిమాలు వరుసగా పండుగ బరిలోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సూర్య సినిమా ‘కరుప్పు’ రిలీజ్ చేస్తే, బాక్సాఫీస్ వద్ద కఠిన పోటీ తప్పదని అర్థమైంది. గతంలో వచ్చిన ఫ్లాపుల కారణంగా తన సినిమా రిస్క్ తీసుకోలేదని భావించి, సూర్య అండ్ టీమ్ ఇప్పుడు సమ్మర్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నారని కోలీవుడ్ టాక్. ఇక పై సూర్య, ఆయన టీమ్ ఈ పరిస్థితిపై అధికారికంగా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఈ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని ‘కరుప్పు’ టీమ్ భావిస్తోంది.
