కరోనా మహమ్మారి సమయంలో ఓటిటీలో నేరుగా విడుదలైన మొదటి పెద్ద చిత్రం “సూరారై పొట్రు”. ఈ సినిమాపై అవార్డుల వర్షం కురుస్తోంది. తాజాగా మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను ఈ మూవీ తన ఖాతాలో వేసుకుంది. షాంఘై ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కావడమే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కోసం కూడా పరిశీలనకు వచ్చింది. 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ప్రదర్శించబడే పది భారతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది. ప్రస్తుతం ఐఎండిబిలో 9.1 రేటింగ్ తో అత్యధిక రేటింగ్ పొందిన మూడవ చిత్రంగా నిలిచింది. ది షాషాంక్ రిడంప్షన్ (1994), గాడ్ ఫాదర్ (1972) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇలా ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం సూర్య కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.
Read Also : “భీమ్లా నాయక్”కు తప్పని కష్టాలు… పోస్టర్ లీక్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖుల డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి ఇందులో హీరోయిన్ గా నటించగా… ఊర్వశి, పరేష్ రావల్, మోహన్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమిళంలో “శురారై పొట్రు”, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ హిట్ ను సాధించింది. భారీ కలెక్షన్లతో పాటు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.