Site icon NTV Telugu

Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?

Vishwanath And Sons

Vishwanath And Sons

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టీజర్‌లో సూర్యని సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు. సూర్య ఈ సినిమాలో తండ్రి ప్రేమ, ఎమోషనల్ డెప్త్ రెండూ కలిసిన ఒక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తెరపై కనిపించిన తీరు, వెంకీ అట్లూరి రాసిన ప్రభావవంతమైన సంభాషణలు.. సూర్య సినీ ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన ప్రదర్శనలను గుర్తు చేస్తున్నాయి.

Also Read :Sree Leela : అవమానించిన శ్రీ లీల ..వీడియో రిలీజ్ చేసిన నటుడు

కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఉత్సాహం, చురుకుదనం తీసుకొస్తుందని టీజర్ సూచిస్తోంది. వయస్సు అంతరం ఉన్న అసాధారణ ప్రేమకథను కూడా ఈ సినిమా చూపించబోతున్నట్టు టీజర్‌లో చూచాయగా తెలిపారు. 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే? అనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్టు అర్ధమవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథ చెప్పడం వెంకీ అట్లూరి శైలి. తనదైన ప్రత్యేక శైలి రచనతో.. ఈ అంశాన్ని కూడా లోతుగా, భావోద్వేగ పరిపక్వతతో మధురానుభూతిని కలిగించేలా చూపిస్తారు అనడంలో సందేహం లేదు. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర సాంకేతిక విలువలు ఉన్న స్థాయిలో ఉండబోతున్నాయని టీజర్‌ తో స్పష్టమైంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. నిమిష్ రవి ఆకట్టుకునే ఫ్రేమ్‌లతో సినిమాను కెమెరాలో బంధిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడు బంగ్లాన్ ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా, విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Exit mobile version