Site icon NTV Telugu

Kanguva: సూర్య ‘కంగువ’ సెకండ్ లుక్ వచ్చేసింది.. చూశారా?

Kanguva Second Look

Kanguva Second Look

Suriya starrer ‘Kanguva’ s ferocious second look out now: నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’ అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో తాజాగా ‘కంగువ’ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ క్యారెక్టర్ లోనూ సర్ ప్రైజ్ చేస్తున్నారు.

Viswambhara: “విశ్వంభర” టైటిల్ కాన్సెప్ట్ వీడియోకి అదిరే రెస్పాన్స్.. డిజైన్ చేసిందెవరో తెలిస్తే షాకవుతారు!

‘విధి కాలం కంటే బలమైనది. గతం, వర్తమానం, భవిష్యత్తు కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే..కంగువ ‘ అంటూ సెకండ్ లుక్ సందర్భంగా మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. సెకండ్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ‘కంగువ’పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, మెస్మరైజ్ చేసే సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ తో ‘కంగువ’ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీదకు గ్రాండ్ గా రాబోతోంది. సూర్య, దిశా పటానితో పాటు యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ, సుప్రీమ్ సుందర్ యాక్షన్ సీక్వెన్స్ లు, మదన్ కార్కే డైలాగ్స్ అందిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version