కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. రీసెంట్ గా సూర్య ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ గత ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయినప్పటికి సూర్య అంటేనే బ్రాండ్ అబ్బా .. ఎందుకంటే
ప్రస్తుతం సూర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘రెట్రో’ మూవీ ఒకటి. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా. సూర్య డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకోవడంతో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి హక్కులపై ఓ వార్త వైరల్ అవుతుంది. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ ‘నెట్ ఫ్లిక్స్’ వారు ఈ సినిమా హిందీ మినహా మిగతా భాషలు హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా కోసం గాను నెట్ ఫ్లిక్స్ గట్టి ధరే ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 80 కోట్లకి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాన్నప్పటికి ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.