కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కచ్చితమైన ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. భారీ విజువల్ ఎక్స్‌పెరిమెంట్‌గా తెరకెక్కిన “కంగువ” తర్వాత ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తన 46వ సినిమాను చేస్తూ తెలుగు మార్కెట్‌కీ దగ్గరవుతున్నాడు. మరోవైపు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో బ్యాలెన్స్ చూపిస్తున్నాడు. ఆ లైన్‌లోనే వస్తున్న అతని లేటెస్ట్ ప్రాజెక్ట్ “కరుప్పు”, దీనికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది.
Also Read : Mamitha Baiju: సినిమా నా జీవితాన్ని మార్చేసింది – మమిత బైజు ఎమోషనల్ రివీల్
ఇండస్ట్రీ టాక్ ప్రకారం, “కరుప్పు” మూవీని కూడా 2026 జనవరి సంక్రాంతి బరిలోనే దించాలి అనుకున్నారు కానీ.. ఈ సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన పెద్ద యుద్ధం జరగనుంది. ప్రభాస్ “రాజా సాబ్”, చిరంజీవి “మన శంకర వర ప్రసాద్”, విజయ్ “జన నాయకుడు”, రవితేజ “RT76”, నవీన్ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు”.. ఇలా భారీ స్టార్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంత హై వోల్టేజ్ కాంపిటీషన్‌లో రిలీజ్ చేయడం కంటే, కాస్త వెనక్కి వెళ్లడం మంచిదని సూర్య టీమ్ నిర్ణయించుకుందని టాక్.
