Site icon NTV Telugu

Suriya– Daughter Diya: ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన.. మరో స్టార్ హీరో డాటర్ !

Shah Rukh Khan Injury

Shah Rukh Khan Injury

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్‌ల వారసులు ఎంట్రీ ఇవ్వడం కొత్తెమి కాదు. కానీ వారు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారు. అనేది ముఖ్యం. కాగా ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు రాబోతుంది.. సౌత్‌లో అందమైన జంటగా పేరొందిన సూర్య–జ్యోతికలు జంటకు ఇద్దరు పిల్లలు – కూతురు దియా, కొడుకు దేవ్ ఉన్నారు. అయితే కూతురు దియా సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. ఆమె అందం చూసి చాలామంది ‘హీరోయిన్‌గా వస్తుందేమో’ అని ఊహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దియా హీరోయిన్‌గా కాకుండా

Also Read : Vijay Sethupathi : ‘బెగ్గర్’, ‘మాలిక్’ కాదు.. విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ ఇదే!

డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. దియా రూపొందించిన తొలి షార్ట్ ఫిల్మ్ పేరు ‘లీడింగ్ లైట్’. ఇది సూర్య–జ్యోతికల సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. కేవలం 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్, బాలీవుడ్ మహిళా గాఫర్ల (ఫిలిం సెట్స్‌లో లైటింగ్ పనులు చూసే టెక్నీషియన్లు) జీవితంపై ఆధారపడి ఉంది. హెటాల్ డెడ్దియా, ప్రియాంకా సింగ్‌, లీనా గంగుర్డే అనే ముగ్గురు మహిళా గాఫర్ల జీవన ప్రయాణమే ఈ షార్ట్ ఫిల్మ్ ప్రధాన కథాంశం. కేవలం 13 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్, ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని రెజెన్సీ థియేటర్‌లో ప్రదర్శితమవుతోంది.

ఆస్కార్‌ క్వాలిఫయింగ్ రన్‌లో భాగంగా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్క్రీనింగ్ జరుగుతోంది. దీంతో, 2026 ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అర్హత సాధించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా తమ కూతురు దియా ఈ చిన్న వయసులోనే దర్శకురాలిగా ఆరంగేట్రం చేయడం పట్ల సూర్య, జ్యోతిక ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “మా కుమార్తె కేవలం 17 ఏళ్ల వయసులోనే.. తన కలను సాధించడం చూసి గర్వంగా ఉంది” అని భావోద్వేగంతో స్పందిస్తున్నారు.

Exit mobile version