తమిళ హీరో సూర్యకు తెలుగునాట కూడా చక్కటి గుర్తింపు ఉంది. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని దక్షిణాదిలో టాప్ స్టార్స్ లో ఒకని గా పేరు తెచ్చుకున్నాడు. తన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు సూర్య. తాజాగా ‘నవరస’తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. ఇదిలా ఉంటే సూర్య ట్విట్టర్‌లో 7 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.
Read Also : చీటింగ్ కేసులో ఆర్యకి రిలీఫ్
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంటారు సూర్య. అభిమానులకు తన అప్ డేట్స్ అన్నింటిని అందిస్తూ తరచుగా తరచుగా వారితో టచ్ లో ఉంటుంటాడు. అగరం ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటూ, ఆ ట్రస్ట్ యాక్టివిటీని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అందుకే ఎప్పటికప్పుడు సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. తాజాగా తన ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య 70 లక్షలకు చేరింది. ఇక ప్రస్తుతం అమెజాన్ కోసం చేస్తున్న ‘జై భీమ్’ షూటింగ్ ను పూర్తి చేశాడు సూర్య. అలాగే పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎదరుక్కుం తునిందవన్’ లో నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ఓ స్ట్రెయిట్ సినిమా కూడా చేయబోతున్నాడు. బోయపాటిశ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.
