NTV Telugu Site icon

Suriya: ఆత్మను పోగొట్టుకున్న సూర్య.. ఎమోషనల్ ట్వీట్

Surya

Surya

Suriya: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నేటి ఉదయం సీనియర్ నటి జమున కన్నుమూశారు. ఈ వార్తను జీర్ణించుకోనేలోపే మరో మరణవార్త టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి నేటి ఉదయం చెన్నెలో కన్నుమూశారు. తెలుగులో సూర్య, విక్రమ్, అజిత్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీనివాసమూర్తి. ముఖ్యంగా సూర్యకు ఆత్మ ఆయనే అని చెప్పొచ్చు. తెలుగులో సూర్య హావభావాలకు, ఆ కట్ అవుట్ కు బేస్ వాయిస్ ఇచ్చిన వ్యక్తి శ్రీనివాస్ మూర్తి. యముడు సినిమాలో సూర్యకు డబ్బింగ్ చెప్పి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సుత్ర్య.. శ్రీనివాసమూర్తి మృతిపై ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన తన సంతాపాన్ని తెలిపారు.

“శ్రీనివాసమూర్తి మరణం నాకు పర్సనల్ గా తీరని లోటు.. తెలుగులో నా సినిమాలకు శ్రీనివాసమూర్తి వాయిస్ ప్రాణం పోసింది. మిమ్మల్ని కోల్పోవడం నిజంగా బాధాకరం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆయన ఒక్క సూర్యకు మాత్రమే కాదు.. మోహన్ లాల్, మమ్ముట్టి, అజిత్, విక్రమ్ లాంటి వారందరికీ తన గొంతును అందినచారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇకనుంచి ఆయన వాయిస్ తో కాకుండా సూర్య వాయిస్ ను ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి.