Site icon NTV Telugu

జై భీమ్ : రియల్ చినతల్లికి 15 లక్షలు అందించిన సూర్య

Surya

Surya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్‌’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. 28 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన ‘జై భీమ్’ సినిమా అందరి మనసులను కదిలించిన ‘చినతల్లి’ పాత్ర అసలు పేరు పార్వతి. ఆమె ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య పార్వతికి సహాయం చేయడానికి 10 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ చేస్తానని చెప్పారు. నటుడు సూర్య మంగళవారం చెన్నైలో రాజకన్ను భార్య పార్వతిని స్వయంగా కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. తన తరపున రూ.10 లక్షలు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్. బాలకృష్ణన్, రాజకీయ నాయకత్వ కమిటీ సభ్యుడు జి. రామకృష్ణన్ తదితరులు పాల్గొని నటుడు సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పడం వరకే కాకుండా కొన్ని రోజుల్లోనే చేతల్లో చేసి చూపిన సూర్యపై ఆయన అభిమానులతో పాటు పలువురు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ

Exit mobile version