Site icon NTV Telugu

Bala-Suriya: కన్యాకుమారిలో ఆ ఇద్దరూ!

ప్రముఖ నటుడు సూర్య, సుప్రసిద్ధ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న ‘నంద’, ‘పితామగన్’ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి కాంబోతో ‘పితామగన్’ 2003లో వచ్చింది. ‘నంద’తో పాటు ‘పితామగన్’ కూడా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్ అయ్యింది.

Read Also : Vijay Deverakonda and Puri Jagannadh : మరో భారీ ప్రాజెక్ట్… నెక్స్ట్ మిషన్ లాంచ్ ఎప్పుడంటే?

సోమవారం వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో మొదలవుతోంది. జ్యోతిక, సూర్య సమర్పణలో వారికి చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఓటీటీలో విడుదలై మంచి గుర్తింపును తెచ్చుకోగా, ఈ నెల 10న థియేటర్లలో విడుదలైన ‘ఈటీ’ చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొదలు కాబోతున్న సూర్య, బాల చిత్రంపై అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.

Exit mobile version