Suresh: మొదటి భార్యతో విడిపోవడానికి కారణం అదే.. ఇక రాశీని పెళ్లాడాక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suresh: సీనియర్ నటుడు సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా ఆయన నటించిన సినిమాలు అన్ని మంచి హిట్స్ అందుకున్నాయి. ఇక హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి పాత్రల్లో కూడా నటించాడు. ప్రస్తుతం అన్ని భాషల్లో ఆయన మంచి పాత్రలను ఎంచుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక వయస్సు పైబడడంతో కొద్దిగా చిక్కిపోయిన సురేష్.. అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సురేష్ తన కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. సురేష్ కు 21 ఏళ్లకే పెళ్లి అయ్యింది. హరితా రెడ్డి అనే అమ్మాయిని సురేష్ వివాహం చేసుకున్నాడు. ఆమె వయస్సు అప్పటికి 18. ఆమె కూడా ఇండస్ట్రీలోనే ఉండేది. వీరికి ఒక బాబు. ఇక కొన్నేళ్ల తరువాత వీరు విడిపోయారు. ఆ తరువాత సురేష్.. దర్శక రచయిత్రి అయిన రాశీని వివాహమాడాడు.
ఇకపోతే ఇప్పటివరకు ఆయన తన మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడు అనేది బయటపెట్టలేదు. ఈ ఇంటర్వ్యూలో ఆ విషయాలను పంచుకున్నాడు. ” నా మొదటి భార్య పేరు హరితా రెడ్డి. ఆమెకు 18 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకేమో పై చదువులు చదువుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలని ఉండేది. నేనేమో సినిమాలు అంటూ తిరిగేవాడిని. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. తన ఇష్టాన్ని నేను గౌరవించాను. ఆమె చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది. విడాకులు తీసుకున్నాకా అక్కడే రెండో పెళ్లి చేసుకుంది. తన ఆస్తి, నా ఆస్తి అని చూడలేదు.. ఉన్న ఆస్తిలో ఇద్దరం చెరో సగం తీసుకున్నాం. ఇక నేను దర్శక రచయిత్రి అయిన రాశీని వివాహమాడను. భార్యాభర్తలుగా మాత్రమే మేము విడిపోయాము. స్నేహితులుగా ఎప్పుడు కలిసే ఉన్నాం. హరిత భర్త చాలా మంచివాడు. నా కొడుకును కూడా ఎంతో బాగా చూసుకుంటాడు. నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. వారు ఇండియా వస్తే మా ఇంట్లో ఉంటారు. బంధం విడిపోయినా స్నేహం మాత్రం ఎప్పుడు మా మధ్య ఉంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?