NTV Telugu Site icon

Surekha Vani: కూతురుతో వెకేషన్లు సరే.. డబ్బులెవరిస్తున్నారు ఆంటీ

Surekha

Surekha

Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి గుర్తింపును అందుకుంది. సినిమాల్లో ఎంతో పద్దతిగా ఉండే సురేఖ.. సోషల్ మీడియాలో మాత్రం యమా హాట్ గా ఉంటుంది. కూతురు సుప్రీత తో కలిసి పబ్ లు పార్టీలు, వెకేషన్స్ అంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో సురేఖ ఆమె కూతురు సుప్రీత చేసే హాట్ హాట్ ఫోటోషూట్లు ఎన్నో విమర్శలకు తావిచ్చాయి. కొన్నేళ్ల క్రితం సురేఖ భర్త మృతి చెందిన విషయం తెల్సిందే. భర్త చనిపోయాకా ఈ తల్లీకూతుళ్లు మరింతగా అందాల ఆరబోత చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ఇక అవేమి పట్టించుకోని వీరు తమ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సురేఖ, కూతురు సుప్రీతను హీరోయిన్ గా మార్చడానికి తెగ కష్టపడుతుంది. ఇప్పటికే ఆమె చిన్న చిత్రాల్లో, షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించింది.

Jagapathi Babu: పెద్ద కూతురికి పెళ్లి చేసి తప్పు చేశా.. చిన్నదానికి నేను పెళ్లి చేయను

మొదటి నుంచి కూడా హై ప్రొఫైల్ లైఫ్ ను మైంటైన్ చేస్తున్న సురేఖ ఈ మధ్య కూతురుతో కలిసి ఎక్కువ వెకేషన్స్ లోనే కనిపిస్తోంది. తాజాగా నేడు ప్రేమికుల దినోత్సవాన్ని ఈ అమ్మాకూతుళ్లు ఒక బీచ్ ఒడ్డున జరుపుకున్నట్లు తెలుస్తోంది. బీచ్ ఒడ్డున కూతురుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ” హ్యాపీ వాలెంటెన్స్ డే అబ్బాయిలు.. ప్రేమ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా సుప్రీత డ్రెస్సింగ్ ను విమర్శిస్తున్నారు. ఎద అందాలను ఆరబోస్తూ ఆమె కనిపించడంతో.. నీ కూతురు హృదయం చాలా పెద్దది.. అని కొందరు.. వెకేషన్స్ సరే.. వీటన్నింటికి డబ్బులు ఎవరిస్తున్నారు అని ఇంకొందరు రాసుకొస్తుండగా.. నెగెటివ్ కామెంట్స్ ఎందుకు.. ఎవరి లైఫ్ వారి ఇష్టం అంటూ ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments