మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. అయినప్పటికి వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక మెగా హీరోలందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉన్నారు. అయితే తాజాగా చిరు సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ లోకి అడుగు పెట్టిన సురేఖ ఫస్ట్ పోస్ట్ ను స్టైలిష్ గా చేసింది. “సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్ ట్విట్టర్‌లో చేరినందుకు సంతోషంగా ఉంది” అంటూ రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది సురేఖ. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Read Also : Bigg Boss Controversy : సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి… తమన్నా షాకింగ్ కామెంట్స్
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చ్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో “ఆర్సీ 15” అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. మరోవైపు చిరంజీవి “ఆచార్య”తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉన్నాడు ‘ఆచార్య’. ఇక చిరు ఖాతాలో ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ వంటి సినిమాలు ఉన్నాయి.
