Site icon NTV Telugu

Surekha Vani: నాకు, నా కూతురుకి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి.. సురేఖా వాణీ సంచలన వ్యాఖ్యలు

Surekha

Surekha

Surekha Vani: టాలీవుడ్ లో సీనియర్ నటి సురేఖా వాణీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు తల్లి, పిన్నిగా నటిస్తూ ఎంతో సాంప్రదాయంగా కనిపించే సురేఖ రియల్ గా ఎలా ఉంటుందో అందరికి తెల్సిందే. ఎదిగిన కూతురుతో పాటు ఎంచక్కా లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే కూతురు సుప్రీత బర్త్ డే వేడుకల్లో సురేఖ చేసిన ఓవర్ కు నెటిజన్లు వారిద్దరిపై విమర్శలు గుప్పించారు. దగ్గర ఉండి కూతురితో బీర్ తాగిస్తూ కనిపించింది. దీంతో అస్సలు నువ్వు తల్లివేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సురేఖా భర్త మృతిచెంది దాదాపు రెండేళ్లు కావొస్తుంది. అప్పటి నుంచి సురేఖా రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు గుప్పుమంటున్న విషయం విదితమే. ఇక కూతురు సుప్రీత సైతం తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుప్రీత తన తల్లికి పెళ్ళికొడుకు దొరికినట్లు హింట్ ఇచ్చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ తల్లీకూతుళ్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. త్వరలో సురేఖా వాణీ పెళ్లి చేసుకోబోతున్నారా..? అని యాంకర్ అడగగా అవును అని చెప్పుకొచ్చింది సుప్రీత. ఇక ప్రస్తుతానికి మీ ఇద్దరు సింగిల్ గా ఉన్నారా..? అన్న ప్రశ్నకు ప్రస్తుతం మేము ఇద్దరం సింగిల్ అని, మాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలంటూ చమత్కరించారు. అయితే ఆ బాయ్ ఫ్రెండ్ కు కొన్ని క్వాలిటీస్ కూడా ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈలోపే సుప్రీత.. నువ్వు చెప్పే క్వాలిటీస్ అతనిలో లేవు కదా మమ్మీ అనగా.. అలాంటివి ఇక్కడ చెప్పకూడదంటూ సురేఖ నవ్వుతూ కూతురు నోరు మూసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ అంకుల్ ఎవరు ఆంటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version