NTV Telugu Site icon

Supritha: మందేస్తున్న వర్మతో సురేఖా వాణి కూతురు.. రీతూ చౌదరితో కలిసి మరీ!

Supritha Pic With Ram Gopal Varma

Supritha Pic With Ram Gopal Varma

Supritha Pic With Ram Gopal Varma while Boozing: రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమాతోనే పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో దయ్యాల మీద సినిమాలు చేసి అందరినీ భయపెట్టిన వర్మ ప్రస్తుతానికి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేయడం మానేసి బూతు సినిమాలకు, వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు. ఒకప్పుడు వర్మ నుంచి ఏదైనా ట్వీట్ వస్తుందంటే ఆసక్తికరంగా ఎదురుచూసే వాళ్ళు సైతం ఇప్పుడు వర్మ ఏంట్రా ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడు అని లైట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత రామ్ గోపాల్ వర్మతో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Aryan Khan: సాయి ధరమ్ తేజ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ప్రేమలో షారుఖ్ ఖాన్ కొడుకు?

రాంగోపాల్ వర్మ మందేస్తున్న సమయంలో వెళ్లి పక్కన కూర్చుని రెండు ఫోటోలు దిగిన ఆమె వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల మీద రకరకాల కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి ఇక ప్రస్తుతానికి సుప్రీత అమరదీప్ చౌదరి హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాక హాట్ ఫోటోలు, వీడియోలు తన తల్లితో కలిసి షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఇక రాంగోపాల్ వర్మతో సుప్రీత ఫోటోలు దిగిన సమయంలోనే నటి రీతు చౌదరి కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. వీరిద్దరూ కలిసి రాంగోపాల్ వర్మ మందేస్తున్న సమయంలో ఆయనతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోల మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.