Site icon NTV Telugu

Amardeep-Supritha : ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ గ్లింప్స్ రిలీజ్..

Supritha

Supritha

Amardeep-Supritha : సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత, బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి జంటగా నటిస్తున్న మూవీ చౌదరిగారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి. సుప్రీత మొదటి మూవీ కూడా ఇదే. మాల్యాద్రి రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ ను చూస్తే చాలా కొత్తగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలను పంచుకున్నారు.

Read Also : Kamal Haasan : శత్రుత్వాన్ని కోరుకోను.. బాధగా ఉంది.. కమల్ హాసన్ లేఖ..

హీరోయిన్ సుప్రీతా మాట్లాడుతూ ‘మూవీ షూటింగ్ చేసేటప్పుడు కొంత భయం వేసినా.. అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఆ విషయంలో మా హీరోకు స్పెషల్ థాంక్స్. టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’ అంటూ తెలిపింది.

నటి సురేఖ వాణి మాట్లాడుతూ ‘నా కూతురు ఫస్ట్ సినిమా ఇది. మూవీ టైటిల్ ఆకట్టుకుంటోంది. గ్లింప్స్ అదిరిపోయాయి. మూవీ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అంటూ వివరించింది.

హీరో అమరదీప్ చౌదరి మాట్లాడుతూ ‘బిగ్ బాస్ నుంచి వచ్చాక సినిమాలు త్వరగా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాం. కానీ కుదరలేదు. సినిమా అంటే అన్నీ కుదరాలి కదా. అవన్నీ ఈ సినిమాకు కుదిరాయి. సినిమాను చక్కగా ప్లాన్ చేసుకుని బయటకు వచ్చాం. మీ అందరి ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను. సినిమాకు మహేంద్ర గారి సపోర్ట్ ఉంది. ఇది చాలా మంచి మూవీ. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Read Also : Kamal Haasan : శత్రుత్వాన్ని కోరుకోను.. బాధగా ఉంది.. కమల్ హాసన్ లేఖ..

Exit mobile version