Site icon NTV Telugu

Surekha Vani: పవన్ తో డేటింగ్.. వంద ముద్దులు.. ఛీఛీ.. కొంచమైనా సిగ్గుగా అనిపించడం లేదా

Surekha

Surekha

Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి కానీ, ఆమె కూతురు సుప్రీత గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. సినిమాల్లో ఎంత పద్దతిగా సురేఖ కనిపిస్తుందో.. రియల్ గా దానికి రివర్స్ లో పక్కా ఫ్యాషన్ బుల్ గా ఉంటుంది. ఇక కూతురుతో పబ్ లు, పార్టీలు, మందు, చిందులు.. ఒకటిని కాదు. ఇక ఇవి కాకుండా రీల్స్, ఇంటర్వ్యూలో ఘాటు ఘాటు సమాధానాలు.. ఇవన్నీ చూస్తున్న నెటిజన్స్ వారిని విమర్శిస్తున్నారు. ఎవరి లైఫ్ వారికి ఉంటుంది అని కొందరు అంటున్నా.. ఈ తల్లీకూతుళ్లు దాన్నంతా తీసుకొచ్చి సోషల్ మీడియాలో చూపించాల్సిన అవసరం లేదని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అప్పుడెప్పుడో.. తాను రెండో పెళ్ళికి సిద్ధమని, డబ్బున్నవాడు, తనను బాగా అర్ధం చేసుకునేవాడు కావాలని సురేఖ చెప్పడం, మరి ఇప్పుడు ఉన్న అతనికి అవేమి లేవని సుప్రీత చెప్పి పరువు పోగొట్టడం తెల్సిందే. ఆ వీడియో అప్పట్లో సెన్సేషనల్ అయ్యింది.

Rakul Preet Singh: ఎంత చూపించినా ఏమి లేదక్కడ..

కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సురేఖా వాణి చాలా కష్టపడుతోంది. అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు అమ్మాకూతుళ్ళు ఘాటు ప్రశ్నలకు.. అంతకుమించి ఘాటు ఆన్సర్లు ఇచ్చి షాక్ ఇచ్చారు. ఒకవేళ మీ అమ్మ గారు డేట్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళతారు? అని యాంకర్ సుప్రీతను అడగడంతో.. ఆమె తడుముకోకుండా పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది. పవన్ తో డేటింగ్ అంటే అమ్మ ఎప్పుడైనా ఓకే అంటుంది.. కింగ్ నాగార్జున అన్నా అంతే అభిమానం అమ్మకు అంటూ తెలిపింది. అందుకు సురేఖా వాణి కూడా అవును అని చెప్పింది. ఇక వంద ముద్దులు పెట్టాల్సి వస్తే ఏ హీరోకి? అని ప్రశ్నించగానే పవన్ కల్యాణ్ అని మొహమాటం లేకుండా చెప్పింది సురేఖా. ఇక ఇదంతా సరదాగా జరిగినా నెటిజన్లు.. తల్లీకూతుళ్ళతో పాటు.. ఈ ప్రశ్నలు అడిగిన యాంకర్ ను కూడా ఏకిపారేస్తున్నారు. ఎలాంటి ప్రశ్నలు వేయాలి అనేది కూడా తెలియకుండా.. అంత పెద్ద కూతురు ఉన్న తల్లిని పట్టుకొని ఏ హీరోతో డేట్ కు వెళ్తారు..? ఎన్ని ముద్దులు పెడతారు..? అని అడుగుతున్నారు. దానికి వీళ్ళు తడుముకోకుండా, కొంచం కూడా సిగ్గులేకుండా సమాధానాలు చెప్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి హీరోయిన్లను ఇలాంటి ప్రశ్నలు అడగడం సాధారణమే. కానీ మరీ ఇలా అడగడం బాగోలేదని చెప్పుకొస్తున్నారు.

Exit mobile version