Site icon NTV Telugu

మెగా బొనాంజా : ఆగష్టు 21న “చిరు 153” సర్ప్రైజ్

Supreme Reveal of Chiru 153 Tomorrow

Chiru-153

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించిన హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలెట్టారు. మరోవైపు ఆయన సినిమా నుంచి అప్డేట్లు రాబోతుండడం ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తోంది. చిరంజీవి పుట్టినరోజు ట్రీట్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్లు రానున్నాయని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ చిరంజీవి 153వ చిత్రానికి సంధించిన అప్డేట్ రాబోతోంది.

Read Also : తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్

తాజాగా ఈ విషయాన్నీ మేకర్స్ మెగా బొనాంజా అంటూ రేపు సాయంత్రం 5 గంటలకు సుప్రీమ్ అప్డేట్ రివీల్ కానుందని ప్రకటించారు. దీంతో రేపు చిరంజీవి 153వ చిత్రం “లూసిఫర్” రీమేక్ టైటిల్ లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ “లూసిఫర్‌” లో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు.

Exit mobile version