NTV Telugu Site icon

Poonam Kaur: అబార్షన్ తీర్పుపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..

Poonam

Poonam

Poonam Kaur: పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటిగా మంచి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె సినిమాలకంటే వివాదాలతోనే బాగా ఫేమస్ అయ్యింది. సమాజంలో జరిగే కొన్ని విషయాలపై సోషల్ మీడియాలో తన గొంతును విప్పే పూనమ్ తాజాగా అబార్షన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై స్పందించింది. సుప్రీం కోర్టు తీర్పుకు తాను మద్దతు పలుకుతున్నట్లు స్పష్టం చేసిన పూనమ్.. దీనివలన మహిళకు స్వేచ్ఛ దొరుకుతుందని అభిప్రాయపడింది. తన జీవితంలో ఎంతోమంది గర్భం దాల్చకా మహిళలను తమకు కట్టుబడి ఉండాలని పురుషులు బెదిరించిన సంఘటనలు చూసినట్లు తెలిపింది. ” నేను సుప్రీం కోర్టు తీర్పుకు మద్దతుగా ఉన్నాను. పెళ్లిని ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి స్త్రీలు గర్భం దాల్చడం చాలా చూశాను. కానీ ఇక్కడ ఒక వ్యక్తి(స్త్రీ) తన జీవితమంతా అనేక విధాలుగా బాధపడాల్సి వస్తుంది. స్త్రీలు తమ పునరుత్పత్తి శక్తిని స్వార్థ ప్రయోజనాల కోసం అవసరమయ్యే ఆయుధంగా ఉపయోగించుకోకూడదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇకపోతే పెళ్లి కానివారు కూడా తల్లి కావడం ఇష్టంలేకపోతే అబార్షన్ చేయించుకోవచ్చు.. పెళ్లైన వారు సైతం తమకు పిల్లలను కనడం ఇష్టం లేకపోతె అబార్షన్ చేయించుకొని హక్కు వారికి ఉంటుందని సుప్రీం కోర్టు సంచలాన్ తీర్పు ఇచ్చిన విషయం విదితమే. పెళ్లి కాకముందు బార్షన్ చేయించుకోవడానికి అమ్మాయిలు భయపడాల్సి రావడం, అందుకోసం వారి ప్రాణాలను పణంగా పడుతుండడంతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. ఇక భార్యకు ఇష్టం లేకుండా ఆమె ఒంటిపై చేయి వేయడం కూడా రేప్ తో సమానమన్న కోర్టు, భార్యకు ఇష్టం లేకుంటే గర్భాన్ని తీయించుకోవచ్చని చెప్పుకొచ్చింది.