కొన్ని సినిమాలు వినోదం మాత్రమే పంచవు.. విలువలు నేర్పిస్తాయి.. ఇంకొన్ని సినిమాలు మనుషులలో మార్పును తీసుకొస్తాయి.. మరికొన్ని సినిమాలు ప్రజల జీవితాలనే మార్చేస్తాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారువారి పాట’చిత్రం అదే తరహా లిస్టులోకి చేరింది. అప్పుడెప్పుడో మహర్షి సినిమా చూసి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ సండే వ్యవసాయం అంటూ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేశారు.. అప్పట్లో అది సంచలనం క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘సర్కారు వారి పాట’ లో తీర్పు మాదిరిగానే సుప్రీం కోర్టు బ్యాంక్ రుణాలను ఎగ్గొట్టిన రైతుకు అనుకూలంగా తీర్పునిచ్చి హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళితే దర్శకుడు పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో మహేష్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. సంపన్నులు సామాన్యుల పరంగా లోన్ రికవరీ విషయంలో ఎలాంటి తేడాని చూపించకూడదని ఇద్దరినీ ఒకేలా ట్రీట్ చేయాలని కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నిన్ననే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా ఇదే అంశాన్ని ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రియల్ గా చెప్పడం విశేషంగా మారింది. రైతుల నుంచి లోన్ లు రికవరీ చేయాలంటూ ఓ బ్యాంకు వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. “పెద్ద చేపలను పట్టుకున్న తరువాత వారి జోలికి వెళ్లండి .. ఇలాంటి పిటిషన్ల వలన రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి” అంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది. ఇక ఈ తీర్పును సర్కారువారి పాట మేకర్స్ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
#SarkaruVaariPaata https://t.co/rQ5wmJfdsG
— Mythri Movie Makers (@MythriOfficial) May 13, 2022
