Site icon NTV Telugu

Rape Case: సినీ నటి రేప్… నటుడి డ్రైవర్ సహా నలుగురి అరెస్ట్!!

1051418 Rape

1051418 Rape

Supporting Actress Gang Raped in Chennai: మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఎన్నో ప్రణాళికలు రూపొందించి పటిష్టంగా అమలు చేస్తున్నప్పటికీ వక్ర బుద్ధితో కొందరు మాత్రం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఓ సహాయ నటి పై నలుగురు వ్యక్తులు కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల సహాయ నటి రేష్మ (పేరు మార్చాం). చెన్నై వలసరవక్కంలోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె నటిగా రాణించాలని తమిళనాడు వచ్చి కొన్ని తమిళ సినిమాల్లో నటించినట్లు సమాచారం.

Kajal: “సత్యభామ” సెకండ్ ఇన్నింగ్స్ కాదు.. కోరిక తీరింది.. కాజల్ కీలక వ్యాఖ్యలు

ఇక్కడ నటించి వచ్చిన డబ్బుతో రేష్మ తన జీవితాన్ని గడుపుతోంది. అయితే మే 28న రేష్మ బంధువులంతా వేరే ప్రదేశానికి వెళ్లారనే సమాచారం తెలుసుకున్న ఒక 4 గురు అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ నలుగురిలో ఒకరు ఒక నటుడి డ్రైవర్ అని అతనికి ఆమెతో ముందే పరిచయం ఉందని తెలుస్తోంది. ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లిన వారు ఆమె నోటికి గుడ్డ కట్టి, కొట్టి, లైంగికంగా వేధించారు. ఈ ఘటన కలకలం సృష్టించగా.. ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు మేరకు నటుడు రమణ కారు డ్రైవర్‌తో సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version