NTV Telugu Site icon

Rajinikanth: రీ-రిలీజ్ ట్రెండ్‌లో జాయిన్ అవుతున్న సూపర్ స్టార్

Baba Re Release

Baba Re Release

Superstar Rajinikanth Joined In Re Release Trend: మహేశ్ బాబు నటించిన పోకిరి సినిమాని రీ-రిలీజ్ చేసి ఘట్టమనేని ఫాన్స్ ఎంజాయ్ చేశారు. జల్సా సినిమాని రీ-రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఖుషి అయ్యారు. చెన్నకేశవ రెడ్డి సినిమాని మళ్లీ విడుదల చేస్తే నందమూరి ఫాన్స్ థియేటర్‌లో రచ్చ చేశారు. ప్రభాస్ బిల్లా మూవీకి స్పెషల్ షోస్ వేస్తే, రెబల్ స్టార్ ఫాన్స్ అంతా జోష్‌లోకి వచ్చారు. సైలెంట్‌గా బాద్షా స్పెషల్ షో వేస్తే తారక్ ఫాన్స్, పీక్ స్టేజ్ సెలబ్రేషన్స్ చేశారు. ఇప్పుడు ఈ ట్రెండ్‌లోకి సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. రజినీ(Rajinikanth) సినిమా రిలీజ్ అవుతుంది అంటే తమిళనాడులో పండగ వాతావరణం ఉంటుంది. ఈ పండగని ఇంకో నెల రోజుల్లో సూపర్ స్టార్ ఫాన్స్‌ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.

డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజు(Rajinikanth Birthday Special), ఈ సంధర్భంగా రజినీ నటించిన ‘బాబా’ సినిమాని రీ-రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు(BABA ReRelease). 2002లో రిలీజ్ అయిన బాబా మూవీని సురేష్ కృష్ణ డైరెక్ట్ చేయగా, మనీషా కోయిరాలా హీరోయిన్‌గా నటించింది. బాబా మూవీలో రజినీ స్టైల్ అండ్ స్వాగ్ సూపర్బ్‌గా ఉంటాయి. రజినీ స్టైల్‌గా నడిచొస్తుంటే, ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. బాబా కౌంటింగ్ స్టార్ట్ అంటూ రజినీ డైలాగ్ చెప్తే, తలైవర్ అభిమానులు థియేటర్ టాప్ లేపారు. గతం గతం అంటూ ఆయన చెప్పే డైలాగ్, ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఫస్ట్ రిలీజ్‌లో బాబా సినిమా ఆడియన్స్ ని అంతగా మెప్పించలేదు కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి బాబా సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో రజినీకాంత్, సాదువుల్లో కలిసి పోకుండా తిరిగి జనాల కోసం వచ్చేయడం చూసి… ఇది రజినీ పొలిటికల్ ఎంట్రీకి చిన్న సాంపిల్ ఏమో అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. హిట్, ఫ్లాప్ అనేది పక్కన పెడితే ‘బాబా’ మూవీ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్‌తో పవర్ ప్యాక్డ్‌గా ఉంటుంది. మరి రీ-రిలీజ్‌లో బాబా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.