Superstar Krishna No More : నేలరాలిన కృష్ణ‘తార’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ ఇక లేరు. ఆదివారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలితో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యాయి. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌గా చెప్పుకోవచ్చని, డయాలసిస్ కూడా జరుగుతోందని వైద్యం అందిస్తున్నప్పుడు వైద్యులు తెలిపారు. 8 విభాగాలకు చెందిన 8 మంది వైద్య నిపుణుల్ని రంగంలోకి దిగి.. ప్రపంచస్థాయి చికిత్సని అందించారు. కానీ.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, వెంటిలేటర్‌పై కన్నుమూశారు. కృష్ణ మృతితో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ అభిమాన నటుడు ఇక లేడన్న విషయం తెలిసి, అభిమానులు సైతం కన్నీరుమున్నీరు అవుతున్నారు.
కాగా.. సూపర్‌స్టార్ కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. ఈయన 1943 మే 31వ తేదీన జన్మించారు. ‘కులగోత్రాలు’ సినిమాతో తెరంగేట్రం చేసిన కృష్ణ.. ‘తేనె మనసులు’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. సోలో హీరోగా కృష్ణ నటించిన మొదటి సినిమా ‘గూఢాచారి 116’. కృష్ణ తెలుగునాట 325పై చిలుకు చిత్రాల్లో నటించారు. ఈయన సినిమాల్లో విజయనిర్మల కథానాయికగా ఎక్కువ సినిమాల్లో నటించారు. కృష్ణ – విజయనిర్మల కలిసి తొలిసారి ‘సాక్షి’ సినిమాలో జోడీ కట్టారు. ఈయన ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే తొలి కౌబాయ్ సినిమా చేశారు. ఈ సినిమానే ఆయనకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఎన్టీ రామారావుతో కలిసి తొలిసారి ‘స్త్రీ జన్మ’ అనే సినిమాలో నటించారు. ‘మంచి కుటుంబం’ సినిమాలో ఏఎన్నార్ అల్లుడి పాత్ర పోషించారు. కృష్ణ తన సొంత నిర్మాణంలో ‘అగ్నిపరీక్ష’ అనే సినిమాను నిర్మించారు. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబు మధ్య బాక్సాఫీస్ వార్ బాగానే నడిచింది.
Also Read
అలాంటి కృష్ణ, శోభన్ బాబు కలిసి ‘ముందడుగు’ అనే మల్టీస్టారర్ సినిమా చేయగా.. అదే ఏకంగా గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఇప్పటికీ గోల్డెన్ జూబ్లీ చేసుకున్న ఏకైక సినిమాగా ‘ముందడుగు’ చరిత్రలో నిలిచిపోయింది. కృష్ణ తన 100వ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’, 200వ చిత్రంగా ‘ఈనాడు’, 300వ చిత్రంగా తెలుగు వీర లేవరా చేశారు. ఆ మేజిక్ ఫిగర్‌కి తగినట్లుగానే ఆ చిత్రాలు ఆయన కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం), తొలి టెక్నోవిజన్ సినిమా (దొంగల దోపిడీ) వంటి ఘనతలు కృష్ణ పేరిట ఉన్నాయి. చివరిసారిగా కృష్న ‘శ్రీ శ్రీ’ సినిమాలో కనిపించారు.
తాజావార్తలు
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!