Site icon NTV Telugu

Krishna: బెజవాడ నడిబొడ్డున కృష్ణ విగ్రహం..ఆవిష్కరించనున్న కొత్త ఘట్టమనేని హీరో

Krishna Statte

Krishna Statte

విజయవాడ నగరంతో ఘట్టమనేని కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది, ఇప్పుడదే నగర నడిబొడ్డున లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం కొలువుదీరనుంది. ఈనెల 11వ తేదీన జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంపై కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు.

ALso Read:Jana Nayagan : వాయిదా దెబ్బతో 50 కోట్లు వెనక్కి..జన నాయగన్ సెన్సేషనల్ రికార్డ్

సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అగ్నిపర్వతం’ సినిమా విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని కృష్ణ వారసుడిగా సినిమా అరంగేట్రం చేస్తున్న ఆయన మనవడు జై కృష్ణ ఆవిష్కరించనున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో జై కృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక విజయవాడలోని సినిమా థియేటర్లు, ఇక్కడి ప్రముఖులతో కృష్ణ గారికి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Exit mobile version