సూపర్ స్టార్ రజినీకాంత్, మేకింగ్ మాస్టర్ మణిరత్నం కలిసి సినిమా చేయబోతున్నారా అంటే కోలివుడ్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్న రజినీ, ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాడట. ఆగస్టు 10న రిలీజ్ కానున్న జైలర్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జైలర్ రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే రజినీకాంత్, నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయడానికి ఏకంగా మణిరత్నంని రంగంలోకి దించాడని సమాచారం. గత కొన్ని సినిమాలుగా రజిని రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. ఆ కొరత తీర్చడానికి మూవీ మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం కలిసి సినిమా చెయ్యబోతున్నాడు. ఇటివలే లైకా ప్రొడక్షన్ హౌజ్ తో రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇందులో ఒక సినిమాకి సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించనుండగా, ఇంకో సినిమాకి మణిరత్నం డైరెక్ట్ చేయనున్నాడని కోలివుడ్ వర్గాల సమాచారం.
‘రజినీకాంత్-మణిరత్నం’లది క్లాసిక్ కాంబినేషన్. దాదాపు 32 ఏళ్ల క్రితం మణిరత్నం, రజినీ కలయికలో దళపతి సినిమా వచ్చింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా నటించిన ఈ మూవీ ఇప్పటికీ ఒక సంచలనమే. మణిరత్నం మేకింగ్, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, ఇళయరాజా మ్యూజిక్, రజినీ మమ్ముట్టి శోభనల యాక్టింగ్ దళపతి సినిమాని చాలా స్పెషల్ గా మార్చాయి. అతి త్వరలో రజినీ-మణిరత్నంల మ్యాజికల్ కాంబో రిపీట్ అవ్వనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అనే మాట వినిపిస్తుంది కానీ ఈ పదం పుట్టక ముందు నుంచే మణిరత్నంకి పాన్ ఇండియా క్రేజ్ ఉంది, రజినీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ లెజెండ్స్ కలిసి చేయబోయే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవ్వడంతో ఆశ్చర్యం లేదు.