NTV Telugu Site icon

Jailer: కమల్ లైఫ్ టైమ్ రికార్డుకి ఆరు రోజుల్లోనే ఎండ్ కార్డ్…

Rajini

Rajini

లోకనాయకుడు కమల్ హాసన్ మాస్ అవతారంలోకి మారి చేసిన సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కమల్ కెరీర్ లోనే కాకుండా కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఏజెంట్ విక్రమ్ గా కమల్ చేసిన పెర్ఫార్మెన్స్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ రేంజులో కమల్ హాసన్ ని ఇప్పటివరకూ చూడకపోవడంతో మూవీ లవర్స్ అంతా విక్రమ్ సినిమాని రిపీట్ మోడ్ లో చూసారు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ తో విక్రమ్ సినిమాకి ప్రాణం పోసాడు. కమల్ లాంటి నటుడికి ఫాహద్, సేతుపతి లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ కూడా తోడవ్వడంతో విక్రమ్ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా విక్రమ్ సినిమా నెవర్ బిఫోర్ యూపోరియాని క్రియేట్ చేసింది. ఓవరాల్ గా విక్రమ్ సినిమా వరల్డ్ వైడ్ 419 కోట్లని రాబట్టి కమల్ కి మాత్రమే కాకుండా కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

విక్రమ్ రాబట్టిన కలెక్షన్స్ చూసి కోలీవుడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి, అయితే విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్స్ ని కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ చేస్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇచ్చాడు. రజినీని చేరడానికి కమల్ కి 30 ఏళ్లు పట్టింది కానీ కమల్ రికార్డ్స్ ని లేపడానికి రజినీకాంత్ కి ఆరు రోజులు సరిపోయాయి అంటూ తలైవర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. దాదాపు అయిదేళ్ల జైలర్ సినిమాతో హిట్ అందుకున్న రజినీకాంత్ ని చూడడానికి మూవీ లవర్స్ అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. దీంతో ఆల్ సెంటర్స్ హౌజ్ ఫుల్ బోర్డులు పెడుతున్నారు. విక్రమ్ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ని ఆరు రోజుల్లో క్రాస్ చేసి రజిని తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. సాలిడ్ బుకింగ్స్ అండ్ స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్న జైలర్ సెకండ్ సండే ఎండ్ అయ్యే టైంకి బాక్సాఫీస్ దగ్గర సృష్టించబోయే వసూళ్ల సునామీలో ఎన్ని రికార్డులు ఎగిరిపోతాయో చూడాలి.

Show comments