NTV Telugu Site icon

Mahesh Babu: ఇలాంటి క్యారెక్టర్ ఇంకొకటి చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా

Business Man

Business Man

మహేశ్ బాబు నటించిన 27 సినిమాల్లో, ఇన్నేళ్ల తెలుగు సినిమా ప్రయాణంలో పూరి జగన్నాధ్ రాసిన ‘బిజినెస్ మాన్’ లాంటి సినిమా ఇంకొకటి లేదు, రాలేదు, ఇకపై కూడా రాదేమో. ఈ మూవీలో గ్యాంగ్ స్టర్ సూర్య భాయ్ పాత్రలో మహేశ్ చేసిన పెర్ఫార్మెన్స్, పూరి రాసిన డైలాగ్స్, తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయిన బిజినెస్ మాన్ సినిమా ఇప్పటికీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. మహేశ్ బాబు ఈ మూవీలో కనిపించినంత ఇంటెన్స్ గా మరో సినిమాలో కనిపించలేదు. సూర్య భాయ్ క్యారెక్టరైజేషణ్ ని పూరి జగన్నాధ్ డిజైన్ చేసిన విధానం అద్భుతం అనే చెప్పాలి. పూరి రాసిన డైలాగ్స్, మహేశ్ నుంచి సూపర్బ్ గా బయటకి వచ్చాయి. ముంబైని పోయించడానికి వచ్చాను, డిల్లికి ఏం కావాలో చెప్పు ఇస్తాను, రౌండప్ చేసి కన్ఫ్యూస్ చెయ్యొద్దు కంఫ్యూషన్ లో ఎక్కువ కొట్టేస్తా, మన అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి లాంటి డైలాగ్స్ థియేటర్స్ లో విజిల్స్ వేయించేలా చేశాయి.

మహేశ్-కాజల్ ట్రాక్ కూడా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయ్యింది. నాజర్, ప్రకాష్ రాజ్ లు పోకిరి తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్స్ ప్లే చేసింది బిజినెస్ మాన్ లోనే. కేవలం మహేశ్ బాబు ఫాన్స్ మాత్రమే కాకుండా ఓవరాల్ గా ప్రతి ఒక్కరికీ నచ్చిన ఈ మూవీ నిజంగానే ఒక సెన్సేషన్. అందుకే బిజినెస్ మాన్ సినిమాకి సీక్వెల్ వస్తుందని, పూరి-మహేశ్ కాంబోలో సినిమా వస్తుందని సినీ అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు కానీ బిజినెస్ మాన్ 2 మొదలయ్యే అవకాశం కనిపించట్లేదు. సీక్వెల్ వెయ్యగల సత్తా ఉన్న క్యారెక్టర్ ని దర్శకుడు, హీరో వదిలేసి సైలెంట్ గా ఉండి పోయారు. ఈరోజుకీ మహేశ్ అభిమానులు సూర్య భాయ్ మళ్లీ వస్తే బాగుండు అని కోరుకుంటారు. అది నిజమయ్యే రోజు వస్తే టాలీవుడ్ నుంచి ఒక పాన్ ఇండియా సినిమా చూసే ఛాన్స్ ఉంది.