Mahesh Babu: రాజమౌళి సినిమాకి నెవర్ బిఫోర్ మహేష్ ర్యాంపేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తున్నాడు… అనే కామెంట్స్ మనకి తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. ఏజ్ తో సంబంధం లేకుండా మహేష్ అంత అందంగా ఎలా ఉంటాడు అనే డౌట్ కూడా అందరిలో ఉంటుంది, ఈ డౌట్ కి జిమ్ వీడియోస్ తో ఎప్పటికప్పుడు ఆన్సర్ ఇస్తూనే ఉంటాడు మహేష్ బాబు. తన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మహేష్ బాబు వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియోస్ చూస్తే సితార, గౌతమ్ లకి కూడా మహేష్ బాబు అన్న అయి ఉంటాడు అనుకోవడంలో తప్పు లేదులే అనిపించకమానదు. మెరుపు వేగంతో పరిగెత్తడం, ఇంటెన్స్ వర్కౌట్స్ చేయడం మహేష్ పోస్ట్ చేసే వీడియోస్ లో కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడాలో అంతా కష్టపడుతున్నాడు. హీరో అంత ఫిట్ అండ్ యంగ్ గా కనిపించడం వెనుక ఇంత కష్టం ఉంటుంది అని తెలియజేస్తూ లేటెస్ట్ గా మహేష్ జిమ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలో మహేష్ బైసెప్స్ చూస్తే ఎవరైనా సరే ఈ రేంజ్ లో ఉన్నాడు ఏంట్రా బాబు అనాల్సిందే. ఫోటోని రీపోస్ట్ చేస్తున్న మహేష్ ఫాన్స్, సోషల్ మీడియాలో #MaheshBabu టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేశ్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లు ఉన్నాడు. ఎప్పుడూ ఫిట్ గానే ఉండే మహేశ్ బాబు… గుంటూరు కారం సినిమా అయిపోగానే అయిపోగానే SSMB 29 సినిమా స్టార్ట్ చేయనున్నాడు. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం కూడా మహేశ్ బాబు ఫిజిక్ పెంచాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ నుంచి రాజమౌళి, మహేశ్ బాబు సినిమా ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ అవనున్నాయి. మరి కొత్త లుక్ లో మహేష్ ఏ రేంజులో కనిపిస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!