Site icon NTV Telugu

Guntur Kaaram: ఈ కారం ఘాటు హాలీవుడ్ వరకూ చేరింది… రీజనల్ సినిమాకి కింగ్

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ప్రకంపనలు టాలీవుడ్ ని దాటి హాలీవుడ్ వరకూ చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ‘గుంటూరు కారం’ టైటిల్ అనౌన్స్మెంట్ మాస్ స్ట్రైక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్న గుంటూరు కారం సినిమా గురించి హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ ని ‘గుంటూరు కారం’గా ప్రకటించారు అంటూ వెరైటీ ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది. ఒక రీజనల్ సినిమాకి ఈ రేంజ్ రీచ్ రావడం మహేష్ బాబుకే సొంతం అయ్యింది. వెరైటీ మ్యాగజైన్ ఆర్టికల్ పబ్లిష్ చేయడంతో మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇది సార్ మా హీరో రేంజ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

రీజనల్ సినిమాలో ఇప్పటివరకూ చూడని ఓపెనింగ్స్ ని ఇచ్చిన మహేష్ బాబు ఈసారి ‘గుంటూరు కారం’ సినిమాతో మెసేజులు వదిలేసి మాస్ సినిమా చూపించబోతున్నాడు. అందుకే అమలాపురం నుంచి అమెరికా వరకూ ఉన్న మహేష్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడే కాదు ఓవర్సీస్ లో మహేష్ బాబుకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఇప్పటివరకూ అక్కడ 11 వన్ మిలియన్ డాలర్ సినిమాలని ఇచ్చాడు. గుంటురు కారం సినిమాకే ఇలా ఉంటే మహేష్ నెక్స్ట్ సినిమా దర్శక ధీరుడు రాజమౌళితో ఉంది. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గ్లొబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందనుంది. పాన్ వరల్డ్ బాక్సాఫీస్ టార్గెట్ గా రానున్న SSMB 29 సినిమాకి హాలీవుడ్ లో ఇంకెంత హవోక్ క్రియేట్ అవుతుందో చూడాలి.

Exit mobile version