Site icon NTV Telugu

Mosagallaku Mosagadu: ఘట్టమేనేని అభిమానులు సెలబ్రేషన్స్ కి రెడీ అవ్వండి

Mosagallaku Mosagadu

Mosagallaku Mosagadu

సూపర్ స్టార్ కృష్ణ… ఈ పేరు వింటే చాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేసిన స్టార్ హీరో గుర్తొస్తాడు. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. మూడు షిఫ్టులు పని చేసి అత్యధిక సినిమాల్లో నటించిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన కృష్ణ రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కృష్ణ అభిమానులు సంబరాలకి సిద్ధమయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఒకేఒక్క తేడా కృష్ణ లేకపోవడమే. మరణించినా మన మధ్యే ఉండే కృష్ణకి ట్రిబ్యూట్ ఇస్తూ మే 31న ‘భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన మొట్టమొదటి కౌ బాయ్’ సినిమా అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని 4K వెర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, నాగ భూషణం, జ్యోతి లక్ష్మీ లాంటి లెజెండ్స్ నటించిన ఈ మూవీని లెజెండరీ ‘కేఎస్ఆర్ దాస్’ తెరకెక్కించారు.

పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై మోసగాళ్లకు మోసగాడు సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు. హాలీవుడ్ లోని “For a Few Dollars More; The Good, the Bad and the Ugly; Mackenna’s Gold లాంటి సినిమాలని చూసి ఇన్స్పైర్ అయ్యి మోసగాళ్లకు మోసగాడు సినిమాని రూపొందించారు. అత్యధిక బడ్జట్ తో రూపొంది 1971లో రిలీజ్ అయిన ఈ సినిమాని అప్పట్లోనే తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం విశేషం. యాభై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ జనరేషన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే లార్జర్ దెన్ లైఫ్ కథ, కథనం, మేకింగ్ స్టాండర్డ్స్ ఉన్న మోసగాళ్లకు మోసగాడు సినిమాతో కృష్ణని గుర్తు చేసుకుంటూ ఘట్టమనేని అభిమానులు థియేటర్స్ కి వెళ్లనున్నారు. ఈ మూవీ రీరిలీజ్ ట్రైలర్ ని మహేష్ బాబు లాంచ్ చేసాడు. ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్ ని రాబట్టింది అంటే మోసగాళ్లకు మోసగాడు సినిమాని ఘట్టమనేని ఫాన్స్ ఎంత స్పెషల్ గా తీసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ అమెరికా థియేటర్ లిస్ట్ వచ్చేసింది, తెలుగు రాష్ట్రాల లిస్ట్ కూడా వచ్చేస్తే ఫాన్స్ ఆ సూపర్ స్టార్ ని చూడడానికి థియేటర్స్ కి వెళ్తారు.

Exit mobile version