రాజ్ కుంద్రా పోర్న్ వ్యవహారం ‘సూపర్ డ్యాన్సర్’ నిర్వాహకులకి తలపోటుగా మారింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి సైతం హౌజ్ అరెస్ట్ కాక తప్పటం లేదు. ఆమె కాలు బయటపెడితే మీడియా నానా యాగీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆమె ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటోంది. త్వరలో శిల్పా జడ్జ్ గా తిరిగొచ్చే సూచనలేవీ కనిపించటం లేదు. ప్రస్తుతానికైతే కరిష్మా కపూర్ గెస్ట్ జడ్జ్ గా కొనసాగుతోంది. కానీ, నెక్ట్స్ వీకెండ్ లో మరో సర్ ప్రైజ్ ఉంటుందని బాలీవుడ్ టాక్… ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ సరికొత్త అతిథులుగా రితేశ్, జెనీలియా దేశ్ ముఖ్ కనువిందు చేస్తారట.
బీ-టౌన్ లో సూపర్ కపుల్ గా పేరున్న రితేశ్, జెన్నీ సూపర్ డ్యాన్సర్ సెట్స్ మీదకు రావటం నిజంగా జోష్ కలిగించే విషయమే! అయితే, మిష్టర్ అండ్ మిసెస్ దేశ్ ముఖ్ పర్మనెంట్ జడ్జెస్ కాదట. కరిష్మా కపూర్ లాగా వారు కూడా గెస్ట్ జడ్జెస్ గానే వ్యవహరిస్తారని టాక్. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచరం లేదు. కానీ, రితేశ్, జెనీలియా ఆల్రెడీ ఒప్పుకున్నారనీ… సోనీ టీవీ ప్రోమో విడుదల చేసే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. శిల్పా శెట్టి కంప్లీట్ గా తప్పుకోవటంతో ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ ఇక మీదట అతిథి న్యాయమూర్తులతోనే నడిచేలా కనిపిస్తోంది. ప్రతీ వారం లేదా రెండు వారాలకి ఒక సారి కొత్త సెలబ్రిటీ జడ్జీలు హల్ చల్ చేయవచ్చు. చూడాలి మరి, రితేశ్, జెనీలియా ‘సూపర్’ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతోందో…
