Site icon NTV Telugu

Sunny Leone: నన్ను చంపేస్తానని బెదిరించారు.. సన్నీ సంచలన వ్యాఖ్యలు

Sunny

Sunny

Sunny Leone: శృంగార తార సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో స్టార్ యాక్ట్రెస్ గా కొనసాగుతోంది. అప్పుడప్పుడు టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ లో కనిపిస్తూ మెప్పిస్తుంది. ఇక ఇప్పుడంటే ఆమెను సన్నీ.. నటి అని మెచ్చుకుంటున్నారు కానీ, ఒకప్పుడు ఆమెను అడల్ట్ స్టార్ అని అవమానించేవారు. ఆమె చేసే వృత్తి ఎలాంటిది అయినా.. మనసు బంగారం. ఎంతోమంది పిల్లలను ఆమె చదివిస్తుంది. ఒక అనాథ పాపను పెంచుకుంటుంది. ఇక తాజాగా ఆమె కెన్నడీ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ.. తన గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యింది. తనను బిగ్ బాస్ మార్చేసిందని చెప్పుకొచ్చింది.

Deepthi Sunaina: షన్ను మాజీ ప్రియురాలు బాగానే విప్పి చూపిస్తుందే

“నేను అడల్ట్ స్టార్ గా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను. హిందీలో వచ్చిన బిగ్ బాస్ నా జీవితాన్ని మార్చేసింది. మొదట బిగ్ బాస్ మేకర్స్ నాకు కాల్ చేసినప్పుడు నా భర్తకు చెప్పాను. అతను వెళ్ళమని చెప్పాడు. బుద్ది ఉందా..? అది ఇండినా..? నన్ను చాలా మంది ద్వేషిస్తారు అని చెప్పాను. నేను అప్పటికే అడల్ట్ స్టార్ ను కాబట్టి ముందు అంత దైర్యం చేయలేకపోయాను. ఇక ఆ తరువాత చాలామంది నన్ను చంపేస్తామని బెదిరించారు. ఇండియా రావద్దని, బిగ్ బాస్ షో లో పాల్గొనవద్దని చెప్పారు. ఇక వాటిని మొత్తం దైర్యంగా ఎదుర్కొని బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టాను. అక్కడ అందరితో కలిసి ఉండడం, వంట చేయడం.. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అక్కడి నుంచి వచ్చాకే అడల్ట్ సినిమాలు చేయడం మానేశాను. నా జీవితాన్ని మార్చేసింది బిగ్ బాస్” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version