Site icon NTV Telugu

Sunny Leone: వాళ్లతో ఆ కోరిక తప్పకుండా తీర్చుకుంటా

Sunny Leone On Offers

Sunny Leone On Offers

Sunny Leone Feeling Sad For Not Working With Them: సన్నీలియోన్ గురించి తెలియని ప్రేక్షకుడు ఎవ్వరు ఉండడు. విదేశాల్లో అడల్ట్ చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. 2012లో ఆ ఇండస్ట్రీకి స్వస్తి పలికి, బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల మనసు దోచేసింది. అప్పట్నుంచి ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటూనే ఉంది. అయితే.. మొదట్లో ఈమెతో కలిసి పని చేసేందుకు చాలామంది సంకోచించారు. ఒక అడల్ట్ స్టార్‌తో కలిసి పని చేయడమేంటి? ఆమెను చిన్నచూపు చూశారు. కానీ.. కాలక్రమంలో ఆమెకు పెరిగిన క్రేజ్ చూసి, ఒక్కొక్కరు ఆమెతో కలిసి పని చేయడం మొదలుపెట్టారు. అయినా.. ఇప్పటికీ కొందరు తనతో కలిసి నటించేందుకు సంకోచిస్తున్నారంటూ సన్నీలియోన్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ ఇంటర్వ్యూలో సన్నీలియోన్ మాట్లాడుతూ.. ‘‘నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలో, నాతో కలిసి పని చేసేందుకు చాలామంది వెనకడుగు వేశారు. అదే సమయంలో నాతో కలిసి నటించేందుకు ఎంతోమంది ఆసక్తి చూపించారు. కానీ.. ఇప్పటికీ పేరొందిన కొన్ని నిర్మాణ సంస్థలు, సెలెబ్రిటీలు నాతో కలిసి పని చేయడానికి సంకోచిస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది. అయినా.. అదేం తనకు బాధ కలిగించడం లేదని, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్లతో కలిసి పని చేసే అవకాశం వస్తుందని, ఎలాగైనా ఆ కోరికని తీరుతుందని ఆశిస్తున్నానని పేర్కొంది. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు తనకు ఇంత ఆదరణ లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని, మొదట్లో కాస్త టెన్షన్‌గా అనిపించిందని చెప్పింది. తనకు మద్దతు తెలుపుతున్న అభిమానులకు ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానని సన్నీ చెప్పింది.

తనకూ ఓ మెరుగైన జీవితం ఉండాలన్న ఆశతోనే తాను అడల్ట్ ఇండస్ట్రీని వదిలేసి.. బాలీవుడ్‌లో అడుగుపెట్టానని సన్నీలియోన్ తెలిపింది. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత తాను పూర్తిగా మారిపోయాయని, గతాన్ని పూర్తిగా పక్కన పెట్టేశానని చెప్పింది. తనకు బాలీవుడ్ అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ ఉండడాన్ని తాను ఇస్టపడుతున్నానంది. ఇప్పటివరకూ తాను చేసిన పాత్రల విషయంలో సంతోషంగానే ఉన్నానని వెల్లడించింది. తాను ఎంపిక చేసిన పాత్రల్లో మంచివి, చెడువి ఉన్నాయని.. అయితే వాటన్నింటినీ తాను ఇష్టపూర్వకంగా చేశానంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టాక.. ఎంతోమంది అద్భుతమైన వ్యక్తుల్ని కలుసుకునే సువర్ణవకాశం లభించిందని సన్నీ చెప్పుకొచ్చింది.

Exit mobile version