వెయ్యి కోట్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పఠాన్ రికార్డులని ప్రమాదంలో పడేస్తూ ‘గదర్ 2’ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. సన్నీ డియోల్ హీరోగా నటించిన గదర్ 2 సినిమా 2001లో వచ్చిన గదర్ కి సీక్వెల్. గద్దర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాని ఇంపాక్ట్ 22 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన గదర్ 2 పైన కూడా ఉంది అంటే గద్దర్ 1 ఏ రేంజులో ఆడియన్స్ ని అలరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆగస్టు 11న గదర్ 2 సినిమా థియేటర్స్ లోకి ఎంటర్ అయ్యింది. మొదటి రోజే 40 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన గదర్ 2, ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సమయానికి 229 కోట్లని రాబట్టి ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదంతో నార్త్ రాష్ట్రాలని పూర్తిగా కమ్మేసింది గదర్ 2 మేనియా.
ఎక్స్టెండెడ్ వీకెండ్ దొరకడంతో గదర్ 2 సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడం లేదు. రోజు రోజుకీ బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ గదర్ 2 మాత్రం స్లో అవ్వట్లేదు. ఇప్పటివరకూ కేవలం హిందీలోనే 400 కోట్లు రాబట్టి గదర్ 2 సినిమా ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులని బ్రేక్ చేసి, నెక్స్ట్ KGF 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తుంది. టాప్ 5 హిందీ సినిమాల లిస్టులోకి ఎంటర్ అయిన ఈ మూవీ సెకండ్ వీక్ లో కూడా సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతుంది. అక్షయ్ కుమార్ నటించిన OMG 2 పోటీ లేకుండా గదర్ 2కి సోలో రిలీజ్ దొరికి ఉంటే ఈ పాటికి బాలీవుడ్ టాప్ మోస్ట్ గ్రాసర్ గా గదర్ 2 నిలిచేది. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి దక్కిన క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్న గదర్ సినిమా లాంగ్ రన్ లో KGF 2, బాహుబలి, పఠాన్ సినిమాల రికార్డులని బ్రేక్ చేస్తుందేమో చూడాలి.