Site icon NTV Telugu

Sunitha Boya: ఆ నిర్మాతపై సంచలన ఆరోపణలు.. మానసిక ఆసుపత్రిలో చేరిక

Sunitha Boya Mental Hospital

Sunitha Boya Mental Hospital

అప్పుడప్పుడు ఫేమస్ అవ్వడానికి కొందరు పెద్దవాళ్లని టార్గెట్ చేసి, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆర్టిస్ట్ సునీత బోయ కూడా అలాంటి పనే చేసింది. ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాతని టార్గెట్ చేసిన ఈమె.. నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చింది. అవకాశాల పేరిట తనని మోసం చేశారని పదే పదే చెప్తూ వస్తోంది. 2019 నుంచి ఆమె ఈ ఆరోపణల పర్వం మొదలుపెట్టింది. ఇలా చేయడం వల్ల తాను వార్తల్లోకెక్కడంతో పాటు సదరు నిర్మాత భయపడి అవకాశాలు ఇస్తాడని భావించింది. ఆ నిర్మాత ఇన్నాళ్లూ ఆమె ఆరోపణల్ని సహిస్తూ వచ్చాడు. అయితే.. ఒక దశలో ఆమె హద్దుమీరి ప్రవర్తించింది. చాలా రకాలుగా బెదిరింపులకు దిగింది.

ఈ నేపథ్యంలోనే ఆ నిర్మాత సునీత బోయకు మానసిక స్థితి బాగోలేదని, ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తే ఆమె మార్పు వస్తుందని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణలో భాగంగా అన్ని పరిశీలించిన న్యాయమూర్తి.. సునీత మానసిక పరిస్థితి సరిగా లేదని స్పష్టం చేశారు. ఆమెను ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల ప్రకారం.. మానసిక వైద్యశాలలో ఆమెను అడ్మిట్ చేసినట్టు తెలిసింది. ఈ ఒక్క విషయంతో సునీత మానసిక ఆరోగ్యం స్థిమితంగా లేదని, ఆమె చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయాయని ఆ నిర్మాత అన్నారు. సునీత బోయ వివాదం ఇక్కడితో ముగిసిందన్న ఆయన.. ఇకపై ఇటువంటి వ్యక్తులు చేసే నిరాధారణమైన ఆరోపణల్ని ప్రసారం చేసే ముందు మీడియా సంయమనం పాటించాలని కోరారు.

కాగా.. సునీత బోయ గతంలో కత్తి మహేశ్‌పై కూడా ఇలాగే లైంగిక ఆరోపణలు చేసింది. ఓ న్యూస్ ఛానెల్‌ను సంప్రదించి, లైవ్‌లో ఆయన తనని రూమ్‌కి పిలిచి లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించింది. అప్పుడు తాను ఎలాగోలా బయటపడ్డానని పేర్కొంది. కానీ, ఈమె చేసిన వ్యాఖ్యలన్నీ తప్పని అదే న్యూస్ ఛానెల్‌లో ఆమె ద్వారానే కత్తి మహేశ్ చెప్పించడం జరిగింది.

Exit mobile version