NTV Telugu Site icon

Sundeep Kishan: కుమారి ఆంటీపై కేసు నమోదు.. చాలా అన్యాయం

Varsha

Varsha

Sundeep Kishan: సోషల్ మీడియాలో కుమార్ ఆంటీ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ITC కోహినూర్ హోటల్ ఎదురుగా ఒక ఫుడ్ స్టాల్ ను నడుపుతూ.. అతి తక్కువ ధరకే మంచి భోజనాన్ని ప్రజలకు అందజేస్తుంది. ఇలా 13 ఏళ్లుగా ఆమె ఈ బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా యూట్యూబర్స్.. ఫుడ్ వీడియోలు చేసి, ఫుడ్ బాగుందని, చాలా తక్కువ దొరికే అని చెప్పడంతో ప్రజలు కుమారి ఆంటీ బండివద్దకు బారులు తీరారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ యూట్యూబ్ లైక్స్ కోసం ఆమెతో ఇంటర్వ్యూ చేయడం, బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశారు.రెండు రోజుల క్రితం హీరో సందీప్ కిషన్ సైతం కుమార్ ఆంటీ బండి వద్దకు వెళ్లి తన సినిమా ఊరి పేరు భైరవకోన ప్రమోషన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీని తర్వాత కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ఆమె బండి వద్ద ప్రజలు బార్లు తీరడమే కాకుండా ట్రాఫిక్ కి ఇబ్బందులను గురి చేశారు. దీంతో కుమారి ఆంటీ పై కోర్టులో కేసు నమోదు అయింది.

తాజాగా ఆవిడ ఫుడ్ ట్రక్ ను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలులేదని, వారి ఫుట్ స్టాల్ వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అవుతుందని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా వారి ట్రక్ ను కూడా సీజ్ చేశారు. దీంతో కుమారి ఆంటీ పోలీసులపై ఫైర్ అయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియా వలనే జరిగిందని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం ఇది చాలా అన్యాయం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ఘటనపై హీరో సందీప్ కిషన్ స్పందించాడు. ట్విట్టర్ వేదికగా కుమారి ఆంటీ కి జరిగింది చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. “ఇది చాలా అన్యాయం.. చాలామంది మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి వారి సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచిన ఆమెను ఇలా చేయడం అన్యాయం. ఈ మధ్యకాలంలో నేను చూసిన బలమైన మహిళా సాధికారత ఉన్న మహిళల్లో ఈమె ఒకరు. నేను, నా టీమ్ ఆమెకు సపోర్ట్ గా ఉంటాం. మేము చేయగలిగినంతవరకు ఏమైతే చేయగలమో అది చేస్తాం.. ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.