Site icon NTV Telugu

Michael: సందీప్ కిషన్ పాన్ ఇండియా హిట్ కొడతాడా?

Sundeep Kishan

Sundeep Kishan

‘ప్రస్థానం’ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేసి తెలుగు సినీ అభిమానుల దృష్టిలో పడి, అక్కడి నుంచి హీరోగా మారి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ‘సందీప్ కిషన్’. ‘రొటీన్ లవ్ స్టొరీ’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ లాంటి సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి హిట్స్ అందుకున్న సందీప్ కిషన్, ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ సందీప్ కిషన్ కి హిట్ మాత్రం అందని ద్రాక్షాగానే ఉంది. టాలెంట్ ఉండి, మంచి కాంటాక్ట్స్ ఉండి లక్ మాత్రమే లేని హీరోగా సందీప్ కిషన్ కెరీర్ సాగిస్తున్నాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సినిమాలకి దూరంగా ఉండకుండా, డిజప్పాయింట్ అవ్వకుండా తిరిగి కెరీర్ ని హిట్ ట్రాక్ ఎక్కించాలి అనే కసితో ఉన్న సందీప్ కిషన్ కి దర్శకుడు రంజిత్ కలిశాడు. ఈ ఇద్దరూ కలిసి తమ బ్లడ్ అండ్ స్వెట్ ని పెట్టి ‘మైఖేల్’ సినిమా చేశారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ టైంలో తెలుగులోనే హిట్ లేదు కానీ సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమా చేస్తాడంట అని కామెంట్స్ చేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ విమర్శలు చేసే వాళ్లు కూడా ఆశ్చర్యపోయే రేంజులో సందీప్ కిషన్ మేకోవార్ అయ్యి ‘మైఖేల్’ సినిమాలో నటించాడు.

ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ నే తెచ్చుకుంది. టీజర్, ట్రైలర్ మైఖేల్ సినిమాపై అంచనాలు పెంచాయి. సందీప్ కిషన్ హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని పెంచడంలో మైఖేల్ మూవీ ప్రమోషన్స్ ఎంతో హెల్ప్ అయ్యాయి. ఫిబ్రవరి 3న అంటే మరో 24 గంటల్లో సందీప్ కిషన్ ప్రాణం పెట్టి వర్క్ చేసిన గ్యాంగ్ స్టర్ లవ్ డ్రామా ‘మైఖేల్’ ఆడియన్స్ ముందుకి రానుంది. ఏడాదిన్నరగా సందీప్ కిషన్ ఈరోజు కోసమే వెయిట్ చేస్తున్నాడు. మరి కొన్ని గంటల్లో సందీప్ కిషన్ కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకి వస్తాడు. ట్రైలర్ తో పెంచిన అంచనాలని మ్యాచ్ చేసినా చాలు సందీప్ కిషన్ కెరీర్ లో మ్యాజిక్ జరిగినట్లే. మరి ఇన్ని రోజులు సందీప్ కిషన్ ని మిస్ అయిన లక్ అనే ఎలిమెంట్ ని మైఖేల్ మూవీ తెస్తుందేమో చూడాలి.

Exit mobile version