Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sigma Trailer: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిగ్మా’పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. తమిళ నాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ హీస్ట్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అండర్‌వరల్డ్ మాఫియా సామ్రాజ్యాన్ని ఢీకొట్టే హై-స్టేక్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ట్రైలర్ లో ఏకంగా రూ.500 కోట్ల డ్రగ్స్, క్యాసినో రాకెట్‌ను ఢీకొట్టబోయే పాత్రలో సందీప్ కనిపించాడు. ట్రైలర్లో సందీప్ కిషన్ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఫరియా అబ్దుల్లా కూడా కీలక పాత్రలో కనిపించడంతో పాటు సందీప్‌తో మంచి కెమిస్ట్రీని పంచుకున్నట్లు ట్రైలర్లో తెలుస్తోంది.
యాక్షన్, అడ్వెంచర్, కామెడీతో పాటు తల్లి కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోషన్ కూడా కథలో కీలకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే భారీ దోపిడీ, క్రైమ్ రాకెట్ చుట్టూ కథ నడిచినా ఫ్యామిలీ ఎమోషన్స్ కి కూడా దర్శకుడు జాసన్ సంజయ్ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తన తొలి సినిమాతోనే కమర్షియల్ ఫార్మాట్లో ఓ భారీ కథను చెప్పే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. టెక్నికల్‌గా కూడా ‘సిగ్మా’ రిచ్‌గా కనిపిస్తోంది. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు స్టైలిష్ లుక్ తీసుకొచ్చింది. ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్ కి మరింత ఎనర్జీ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు కూడా ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 2న ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్వీఆర్ సినిమా కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లతో బజ్ పెంచుకున్న ఈ సినిమా ట్రైలర్ కూడా యాక్షన్, హీస్ట్ ఎలిమెంట్స్‌తో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మరి జాసన్ సంజయ్ తన తొలి సినిమాతో ఎలాంటి థియేట్రికల్ అనుభూతిని అందిస్తారో అక్టోబర్ 2న చూడాలి.
Also Read
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!