NTV Telugu Site icon

Sundaram Master Teaser: గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే.. ఎట్టా ఉంటాదో తెలుసునా.. ?

Sundaram

Sundaram

Sundaram Master Teaser: వైవా అనే చిన్న షార్ట్ ఫిల్మ్ తో ఫేమస్ అయ్యాడు హర్ష. ఆ షార్ట్ ఫిల్మ్ ఎంత ఫేమస్ అయ్యింది అంటే హర్ష ఇంటిపేరు వైవాగా మారిపోయింది. ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత వైవా హర్ష దశ మారిపోయింది. వరుస సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి కామెడీచేసి స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.ఇక ఇప్పుడు ఆ స్టార్ కమెడియన్ కాస్తా హీరోగా మారాడు. అవును వైవా హర్ష హీరోగా నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని RT టీమ్ వర్క్స్ మరియు గోల్ డెన్ మీడియా బ్యానర్స్ పై మాస్ మహారాజ రవితేజ, సుధీర్ కుమార్ కుర్రా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో వైవా హర్ష సరసన దివ్య శ్రీపాద నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.

Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ వేగం చూస్తుంటే.. మెంటలెక్కిపోతుందే

టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. సుందరం మాస్టర్ గా వైవా హర్ష కనిపించాడు. ఇక కథ విషయానికొస్తే.. సుందరం మాస్టర్ ఒక సోషల్ టీచర్. అతనికి ఇంగ్లిష్ అస్సలు రాదు. అయితే అతనిని.. ఒక గిరిజన తెగ పిల్లలకు చదువు నేర్చపించడానికి ఇంగ్లిష్ టీచర్ గా పంపిస్తారు. సోషల్ టీచర్ అయిన సుందరం మాస్టర్ .. ఆ తెగలో ఉన్న పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా చదువు చెప్పాల్సి వస్తుంది. దీంతో సుందరం మాస్టారు.. వారికి ABCD చెప్పడం కోసం తంటాలు పడుతుంటాడు. ఈలోపే ఆ గిరిజనులు ఫ్లూయింట్ ఇంగ్లిష్ లో మాట్లాడడంతో సుందరానికి చెమటలు పడతాయి. అతనికి ఇంగ్లిష్ మాట్లాడడం రాదని తెలుసుకున్న గిరిజనులు అతడితో పనులు చేయిస్తూ ఉంటారు. మరి.. ఆ గిరిజనుల దగ్గర నుంచి సుందరం మాస్టర్ బయటపడతాడా.. ? అసలు ఎందుకు ఆ గ్రామానికి సుందరం వెళ్లాల్సి వచ్చింది.. ? గిరిజన యువతిని ప్రేమించిన మాస్టర్.. పెళ్లి చేసుకున్నాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. టీజర్ ను బట్టి ఇదొక కామెడీ సినిమాగా తెలుస్తోంది. టైటిల్ పాత్రలో వైవా హర్ష నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే..ఎంత అందంగా ఉంటుందో ఈ టీజర్ లో కనిపిస్తుంది. ఇక శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో వైవా హర్ష ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments