NTV Telugu Site icon

మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో!

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో..’ కూడా యంగ్ హీరో సుశాంత్‌కు ఓ కీలక పాత్రను ఇచ్చారు. ఇప్పుడదే ఫార్ములాను మహేష్ సినిమాకు కూడా త్రివిక్రమ్ ఫాలో అవుతున్నాడని, సుమంత్ పాత్ర ఈ చిత్రానికి హైలెట్‌గా ఉండబోతుందనేలా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. కాగా 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.