NTV Telugu Site icon

Suman: చంద్రబాబు అరెస్ట్ పై సుమన్ కీలక వ్యాఖ్యలు

Chandrabbu

Chandrabbu

Suman: నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నాడు. రాజకీయాలలో ప్రత్యేక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ.. పరోక్షంగా రాజకీయ నాయకుల గురించి .. పార్టీల గురించి.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి తన అభిప్రాయాలను తెలుపుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎంతగా హీటెక్కిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయాలు మరింత వేడెక్కిపోతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 14 రోజుల రిమాండ్ ను కోర్టు పొడిగించడంతో ఇంకా చంద్రబాబు జైలులోనే ఉన్నారు. ఇక ఈ అరెస్ట్ గురించి సినీ ప్రముఖులు చాలా తక్కువమంది స్పందించారు.

Faria Abdullah : ట్రెడిషనల్ డ్రెస్సులో యువరాణిలా మెరిసిన ఫరియా అబ్దుల్లా…ఎంత అందంగా ఉందో..?

తాజాగా నటుడు సుమన్.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాడు. ఆయన అరెస్ట్ తప్పు కాదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చంద్రబాబు టైమ్ బాలేదని .. అందుకే ఆయన చిన్న కోర్టులో కూడా ఓడిపోయాడని సుమన్ తెలిపాడు. ఆయనకు అన్ని అనుకూలంగా వచ్చేవరకు చంద్రబాబు జైల్లోనే ఉంటారు. సీఎం జగన్ వలనే.. చంద్రబాబును అరెస్ట్ చేసారని అందరు అంటున్నారు.. కానీ అది నిజం కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు.. అన్ని తెలుసుకున్నాకే అరెస్ట్ చేసి ఉంటారు. ఆయనను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. టైమ్ కలిసి రానప్పుడు ఇలానే జరుగుతాయి” అం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.