Site icon NTV Telugu

Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్.. అసలు కారణం ఇదే..?

Naresh

Naresh

Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అయితే ఆ అరెస్ట్ వెనుక నాగ చైతన్య ఉన్నాడు అని అందరు చెప్పుకొచ్చారు. అదేనండీ.. కస్టడీ ప్రమోషన్స్ ఏమో అనుకున్నారు. అయితే అది కాదంట. సుమను అరెస్ట్ చేసింది కానిస్టేబుల్ శివ కాదంట.. సీఐ శివకుమార్ అంట. అవును మీరు విన్నది నిజమే.. ఉగ్రం టీమ్ సుమను అరెస్ట్ చేసింది. ఇప్పుడు అర్దమయ్యిందా.. సీఐ శివకుమార్ ఎవరు అన్నది.. అల్లరి నరేష్. నాంది సినిమాతో గట్టి హిట్ అందుకున్న కాంబో.. ఉగ్రం తో రిపీట్ అవుతుంది. నరేష్, మిరానా జంటగా నటిస్తున్న చిత్రం ఉగ్రం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నరేష్.. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ శివ కుమార్ పాత్రలో కనిపించనున్నాడు.

Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్..?

అన్యాయాన్ని ఎదిరించి తన కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్న ఒక పోలీస్.. ఉగ్ర రూపం తెరిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను చాలా డిఫరెంట్ గా మొదలు పెట్టారు. యాంకర్ సుమ అరెస్ట్ అని ఒక ఫోటోను షేర్ చేసి.. ఆసక్తిని రేకెత్తించారు. ఆ తరువాత సుమను అరెస్ట్ చేసింది ఉగ్రం టీమ్ అని, ఆమెను ఎందుకు అరెస్ట్ చేశామో రేపు చెప్తామని ఒక చిన్న వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో కారులో సంకెళ్లతో సుమ.. పక్కన అల్లరి నరేష్ కనిపిస్తున్నారు. సుమ నన్నెందుకు అరెస్ట్ చేశారు అని, దారిలో తినడానికి ఆపండి అని అడుగుతూ నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి రేపు ఈ ఫుల్ ఇంటర్వ్యూలో నరేష్ ను సుమ ఆడుకుంటుందో.. సుమనే అల్లరోడు ఆడుకుంటాడో చూడాలి.

Exit mobile version