Site icon NTV Telugu

Suma Kanakala: కుమారీ ఆంటీ డీజే సాంగ్.. సుమక్క చూడండి ఏ రేంజ్ లో డ్యాన్స్ వేసిందో..?

Anchor Suma

Anchor Suma

Suma Kanakala: యాంకర్ సుమ కనకాల తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర పై సందడి చేస్తూనే.. ఇంకోపక్క ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు అంటూ నిత్యం ఆమె కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు.. సుమ లేకుండా రిలీజ్ అవ్వవు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇవన్నీ కాకుండా సుమ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తన స్టాఫ్ తో ఎదో ఒక కామెడీ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ట్రెండ్ అయిన వీడియోలను రీ క్రియేట్ చేయడంలో సుమ సిద్దహస్తురాలు.

ఇక ఈ మధ్య కుమారీ ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రెండు లివర్లు ఎక్స్ట్రా అనే వీడియోతో ఆమె ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ఇక దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద లెక్కలేనంత మంది జనం పోగోవ్వడం.. ట్రాఫిక్ జామ్ అవ్వడం.. పోలీసులు రావడం.. ఆమెపై కేసు పెట్టడం.. ఇలా చకచకా జరిగిపోయాయి. ఇక కుమారీ ఆంటీ వీడియో ను డీజే మిక్స్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. తాజాగా కుమారీ ఆంటీ డీజే సాంగ్ కు సుమ కూడా అదిరిపోయే స్టెప్పులు వేసింది. మధ్యలో బ్రహ్మాజీ వీడియోలను కూడా వాడేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ సుమక్క.. పర్ఫెక్ట్ సెట్ అయ్యింది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version